విద్యార్ధులకు రేవంత్ వరాల జల్లు
Revanth shower for students
హైదరాబాద్, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కామన్ డైట్ ప్లాన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు. ‘పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉంది. ఆ బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను నిర్లక్ష్యం చేయొద్దు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని చనిపోవడం బాధాకరం. డైట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. బాధ్యులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.’విద్యార్థుల ఫుడ్ విషయంలో వస్తున్న సమస్యలపై స్వయంగా సమీక్షించాను. బిల్లుల సమస్య ఉందని చెప్పారు. అందుకే ఇకనుంచి ప్రతీనెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లిస్తాం. ఒక్కరూపాయి పెండింగ్ లేకుండా రెషిడెన్షియల్ విద్యాలయాలకు బిల్లులు చెల్లిస్తాం. స్వయంగా నేనే దీన్ని మానిటరింగ్ చేస్తా. పెండింగ్ లేకుండా చేస్తా. మహిళా సంఘాలకు విద్యార్థుల దుస్తులు కుట్టే బాధ్యతను అప్పగించాలి. దీనికి సంబంధించి రూ.30 ఛార్జీలను 70 రూపాయలకు పెంచుతాం’ అని సీఎం ప్రకటించారు.’చదువుకునే విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఉచితంగా కరెంటు ఉవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రైతులకు ఉచితంగా 24 గంటలు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. అందుకే విద్యార్థులకు ఎందుకు ఇవ్వొద్దని.. ఆలోచించాం. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాల, గురుకులాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయించాం. ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు చెల్లించొద్దు’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ నుంచి లోకల్ ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై.. వరకు అందరు అధికారులు హాస్టళ్లను సందర్శిస్తారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు. సీఎస్ నుంచి లోకల్ అధికారుల వరకు మీ దగ్గరకు రావాలని ఆదేశాలు ఇచ్చాం. వారిని చూసి మన విద్యార్థులు ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా ఆలోచన చేస్తున్నాం. విద్యార్థుల విషయంలో ప్రభుత్వ రాజీ పడటం లేదు. బాగా చదువుకొని నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇటీవల ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు 200%, డైట్ చార్జీలు 40% పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్స్ పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల తనిఖీల వివరాలు :
సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలలోని ఒక సంక్షేమ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల, బోనకల్ లో తనిఖీలు నిర్వహించారు. మంత్రులు డి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్, దామోదర రాజనరసింహ భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెం, కొండా సురేఖ TGSWR JC(బాలురు), హతనూర, సంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ TGSWR JC(బాలుర), షేక్‌పేట, హైదరాబాద్, డి అనసూయ సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ RI, TWD, జూపల్లి కృష్ణారావు, TGSWR JC(బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించారు