Friday, November 22, 2024

రేవంత్ వ్యూహం

- Advertisement -

రేవంత్ వ్యూహం

Revanth Strategy

హైదరాబాద్, ఆగస్టు 30 (న్యూస్ పల్స్)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఒవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుంది.అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణమున్నట్లే.. ఒవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని దెబ్బతీసేందుకే ఈ రకమైన ఎత్తుగడలకు రేవంత్ దిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. 2023 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఊహించని విధంగా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగిరింది. 2019 ఎన్నికలలో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమయిన బీజేపీ దానికి రెట్టింపు స్థానాలను సాధించగలిగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీ ఒవైసీ పార్టీతో అంటకాగింది. దాని ఫలితంగా హిందుత్వ వాదులు ఎక్కువ మంది బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో కమలం పార్టీ బలపుడుతుంది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ప్రధాన శత్రవు అయి కూర్చునే ప్రమాదముందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమయిన బీజేపీ రాష‌్ట్రమంతటా విస్తరించగలిగిందంటే కేవలం ఒవైసీ కారణంగానేనని అన్న అనుమానం రేవంత్ లో బలంగా పడింది.. అందుకే ఒవైసీ కుటుంబాన్ని హైడ్రా పేరిట టార్గెట్ చేయగలిగితే బీజేపీ ఓట్లలో కొంత వరకైనా కాంగ్రెస్ కు షిఫ్ట్‌ అయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు రేవంత్ రెడ్డి వేస్తున్నారు. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఆయన ఒవైసీ విద్యాసంస్థలు, ఆసుపత్రి వంటి వాటిపై బుల్‌డోజర్లు పంపాలని నిర్ణయించినట్లు పొలిటికల్ క్యారిడార్ లో వినిపిస్తున్న మాట. ఎటూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే తనకు పోటీ ఉంటుంది. కానీ బీజేపీ అధికార పార్టీ ఓట్లు చీల్చకుండా ఇలాంటి వ్యూహాలకు రేవంత్ దిగారన్నది సీనియర్ నేతలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందన్నది కాలమేచెప్పాల్సి ఉంటుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్