- Advertisement -
తిరుమలకు రేవంత్
తిరుమల, మే 21
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుమల చేరుకున్నారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేస్తారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం అయ్యారు
- Advertisement -