78 కిలోల కేక్‌ను కట్‌ చేసిన వి.హనుమంతరావుతో రేవంత్‌

- Advertisement -

హైదరాబాద్‌: కాంగ్రెస్‌  అగ్రనాయకురాలు సోనియాగాంధీ  జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. సోనియా గాంధీ 78వ పుట్టిన రోజు వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  78 కిలోల కేక్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో రేవంత్‌ కట్‌ చేయించారు. 6 గ్యారంటీ హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు.

Revanth with V. Hanumantha Rao who cut the 78 kg cake
Revanth with V. Hanumantha Rao who cut the 78 kg cake

ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular