- Advertisement -
పెట్టికోట గ్రామంలో రెవెన్యూ సదస్సులు…
Revenue meetings in Pettikota village...
కొలిమిగుండ్ల, డిసెంబర్ 17,
కొలిమిగుండ్ల మండలంలోని పెట్టికోట గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డి, ఇంకా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని గ్రామంలోని రైతులు వినియోగించుకోవాలని తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డి అన్నారు. భూ సమస్యలు ఉన్నవారు అర్జీలను తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డికి రైతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు గొంగటి హుసేన్ రెడ్డి, గొంగటి నారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, ఇంకా గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ అధికారులు గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -