పోషణ ఆరోగ్య జాతర పై సమీక్ష..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Review on nutrition health fair..
కరీంనగర్
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో త్వరలో నిర్వహించనున్న పోషణ ఆరోగ్య జాతర పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యునిసెఫ్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ, ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, మెప్మా ఐకెపి శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలు తీసుకోవాల్సిన పోషకాహారం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత, నాటిక వంటి కార్యక్రమాలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, యునిసెఫ్ అధికారులు డాక్టర్ క్యాతీ తివారి, బి.వి.సుబ్బారెడ్డి, అడిషనల్ డిఆర్‌డిఓ సునిత, డిఎంహెచ్.ఓ సుజాత, మెడికల్ ఆఫీసర్ సౌమ్య, పంచాయతీ రాజ్ ఏఓ ఫరీదుద్దీన్, ఎంపీడీవో, ఎంపీఓ, సిడిపిఓలు, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
మానకొండూరులో పాఠశాల పరిశీలన:
పోషణ ఆరోగ్య జాతర నిర్వహణకు గాను మానకొండూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి పరిశీలించారు. ఇదే పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్ర సొంత భవనాన్ని కూడా పరిశీలించారు. ఆరోగ్య పోషణ జాతర నిర్వహణకు ఉన్న సౌకర్యాలను గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషణ జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, మానకొండూర్ తహసిల్దార్ రాజేశ్వరి ఉన్నారు.