పట్టుదల గల ప్రజా నాయకుడు రితీష్ రెడ్డి
Ritish Reddy is a persistent public leader
బద్వేలు టిడిపి మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి
బద్వేలు
అభివృద్దేప్రధాన లక్ష్యంగా ప్రజల మనసులను తెలుసుకున్న పట్టుదలగల ప్రజానాయకుడు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ (ఇంచార్జ్) సమన్వయకర్త యువ నాయకుడు రితీష్ రెడ్డి అని బద్వేలు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి ఓ ప్రకటనలో కొనియాడారు. బద్వేల్ నియోజకవర్గం ప్రాంతం అభివృద్దే లక్ష్యంగా చేసుకొని ప్రజల మనసులను తెలుసుకొని వారి తాతగారైన మాజీ దివంగత మంత్రి వీరారెడ్డి ట్రస్టు ద్వారా మరియు విద్య సంస్థల ద్వారా నిరుద్యోగ నిర్మూలనకు అభివృద్ధి అంటే ఇలా ఉండాలి నాయకుడు అంటే ఇలా నడుచుకోవాలి అనే దృక్పథంతో బద్వేల్ నియోజకవర్గం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రామాలలో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లను, పట్టణాలలో సీసీ రోడ్లను మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉండేందుకు అనేక రకాలు చర్యలు తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాడని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు బద్వేల్ నియోజకవర్గం లో శరవేగంగా జరుగుతున్నాయని అందుకు నియోజవర్గ సమన్వయకర్త యువ నాయకుడు రితీష్ రెడ్డి కృషి చెప్పలేనిదని వెంగళరెడ్డి అన్నారు.