రోడ్డు భద్రత నిత్యజీవితంలో భాగంకావాలి
Road safety should be a part of everyday life
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి
జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్
జగిత్యాల,
ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం జగిత్యాల రవాణా శాఖ, ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జగిత్యాల కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్తులు ర్యాలీ నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఎంవిఐ లు రామారావు,
వెంకన్న,అభిలాష్, ప్రమీల,యూట్యూబ్ ఫెమ్ గంగవ్వ, ట్రస్మా జిల్లా అధ్యక్షులు బోయినిపెల్లి శ్రీధర్ రావు, విద్యాసంస్థల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు
రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తూ సురక్షితంగా ఇళ్ళు చేరుకోవాలన్నారు.
చిన్న పొరపాటు,నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలన్నారు.
ప్రయాణికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదలా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారించ వచ్చన్నారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ,హెల్మెట్ పెట్టుకోకుండా,లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపరాధని రోడ్డు బాధ్రత నియమాలు పాటించాలని డీటీఓ శ్రీనివాస్ వాహనాధారులకు సూచించారు.
యూట్యూబ్ ఫెమ్ గంగవ్వ మాట్లాడుతూ చిన్న పిల్లలు అమ్మ, నాన్నలను బైక్ లు కొనియ్యమని ఒత్తిడి తేవద్దని,ఎక్కువ స్పీడ్ వెళ్లి ప్రమాధాల బారినపడి తల్లి, తండ్రులకు పుత్ర శోకం మిగిల్చవద్దన్నారు. హెల్మెట్ పెట్టుకుని, వాహనాలు నడుపాలన్నారు.
మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని గంగవ్వ పేరెంట్స్ కు సూచించారు.
కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులు రోడ్డు భధ్రత పాటిస్తూ వాహనాలు నడుపాలాంటూ ప్లే కార్డులు ప్రధరిస్తూ జగిత్యాల పట్టణంలోనిర్వహించిన ర్యాలీ సక్సెస్ అయింది.
ఈకార్యక్రమంలో ట్రస్మా జగిత్యాల పట్టణ అధ్యక్షులు ఎడమల జగన్మోహన్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్లు గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, హరిచరణ్ రావు, రాబర్ట్, భోగ రవిప్రసాద్,శ్యామ్,
జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్, సయ్యద్ ఎగ్బల్ హుస్సేన్,తదితరులు పాల్గొన్నారు.