మోదీకి  రోబో ఛాయ్‌

- Advertisement -

ఫొటో మిస్‌ అవ్వొద్దన్న మోదీ

Robot Chai for Modi
Robot Chai for Modi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌’ 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు..

Robot Chai for Modi
Robot Chai for Modi

ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ (Robotics Gallery)ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్‌ (Chai) ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ”గుజరాత్‌ సైన్స్‌ సిటీలో రోబోటిక్స్‌ గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుంది. రోబో మాకు ఛాయ్‌ ఇచ్చిన ఫొటోను మిస్‌ అవ్వొద్దు” అని మోదీ ఆ ఫొటోలను క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ గ్యాలరీలో అధునాతన రోబోలను ఆసక్తిగా తిలకించిన ప్రధాని.. వాటిని తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular