Sunday, September 8, 2024

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, మానస చౌదరి ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి సాంగ్

- Advertisement -

రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ సందర్భంగా వెంకటేష్  చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీచరణ్ పాకాల మాస్,  యూత్-ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.

roshan-kanakala-and-manasa-chaudhary-bubblegum-first-single-habibi-jilebi-song-launched-by-victory-venkatesh
roshan-kanakala-and-manasa-chaudhary-bubblegum-first-single-habibi-jilebi-song-launched-by-victory-venkatesh

పాపులర్ సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్  లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్.
మనసుని హత్తుకునే జెన్జీ  ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా “బబుల్‌గమ్” రూపొందించారు.  సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న “బబుల్‌గమ్” తప్పకుండా చూడదగ్గ చిత్రంగా ఉండబోతుంది.గరుడవేగ, తెల్లవారితే గురువరం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.
తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్