దర్బార్ హోటల్ లో కుళ్లిన ఆహార పదార్ధాలు

- Advertisement -

దర్బార్ హోటల్ లో కుళ్లిన ఆహార పదార్ధాలు
మేడ్చల్

Rotten food items in Durbar Hotel

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ లోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు .
నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్  రెస్టారెంట్ లో ఫుడ్ ఇనస్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుళ్లిన , గడువు మీరిన ఆహారపదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కుళ్లిన , తేదీ మీరిన ఆహారపదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణం అవుతున్న రెస్టారెంట్లు , హోటళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను  డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular