- Advertisement -
రౌడీ షీటర్ శ్రీకాంత్ విశాఖ జైలుకు తరలింపు
నెల్లూరు
Rowdy sheeter Srikanth shifted to Visakhapatnam jail
రౌడీ షీటర్ అలివేలి శ్రీకాంత్ ను నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు విశాఖకు తరలించారు. శ్రీకాంత్ నెట్ వర్క్ ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే అరుణ అరాచకాలు, శ్రీకాంత్ నేర సామ్రాజ్యం లో రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. శ్రీకాంత్- అరుణ నేర సామ్రాజ్యాన్ని వెలికితీస్తున్నారు. వీరిద్దరితో కలిసి నేరాలు చేసిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. శ్రీకాంత్- అరుణకు సహకరించిన గ్యాంగ్ల కోసం గాలింపు ప్రారంభించారు.
- Advertisement -



