Friday, November 22, 2024

జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

- Advertisement -

జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

RRR trap for Jagan

ఏలూరు, సెప్టెంబర్ 2 (న్యూస్ పల్స్)
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఏం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మెడకు రాజుగారి ఉచ్చు బిగుసుకోబోతుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. అప్పటి ఎంపీ, ఇప్పటి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది ఆర్ఆర్ఆర్  ఆరోపణ.. నిజానికి ఆయన ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీకి కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ చేశారు రఘురామ. తనపై ఏకంగా హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు ఆయన. దీనిపైనే ఇప్పుడు విచారణ జరగబోతుంది. అందుకే ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారన్న చర్చ నడుస్తోంది..ఈ కేసులో నిందితుల లిస్ట్‌లో ఉన్నదెవరో తెలుసా? మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి.. అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్.. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు. గుంటూరు సీఐడీ ఏఎస్పి  విజయ్‌ పాల్.. అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్ ప్రభావతి.. ఇప్పటికే వీరందరికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి విజయ్‌పాల్‌కు ఇప్పటికే నోటీసులు అందాయి. ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో.. ఆయన ఇంటికి నోటీసులు పంపారు. అప్పుడు ఆయనే విచారణాధికారిగా ఉన్నారు. విచారణ ఎలా జరిగింది? సాక్ష్యాలు ఏం సేకరించారు? ఇలా అన్ని ఇవ్వాలని నోటీసుల్లో పేర్కోన్నారు అధికారులు.కానీ ఆయన అబ్‌స్కాండ్‌లో ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రభావతి పేరు చేర్చడం కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే అప్పుడు రఘురామకు వైద్య పరీక్షల అనంతరం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు రఘురామ.ఒక్కసారి ఆయన అందుబాటులోకి వస్తే కేస్‌ సీనే మారిపోనుంది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు ఎలా తీసుకొచ్చారు. ఎన్ని వాహనాలు వినియోగించారు? విచారణ ఎలా జరిగింది? విచారణలో పాల్గొన్న అధికారుల పేర్లేంటి? వారి హోదాలేంటి? ఇలా ప్రతి ఒక్క అంశంపై ఫోకస్ చేయనున్నారు ప్రస్తుత విచారణ అధికారులు.. కేసు నమోదు అయ్యింది.. పోలీసులు విచారణ జరిపారు. మరి ఇందులో అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌ ఇన్‌వాల్వ్‌మెంట్ ఏంటి అనేదేగా మీ ప్రశ్న.. సీఎం జగన్‌ ప్రమేయంతోనే ఇదంతా జరిగిందంటున్నారు రఘురామ. ఉదయం తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తే.. పది గంటలకు ఎఫ్ఐఆర్  నమోదు చేశారు.గంటన్నర టైమ్‌లో మంగళగిరి నుంచి హైదరాబాద్‌ వచ్చి అరెస్ట్ చేశారు. ఇదంతా మాములుగా జరిగిందని తాను అనుకోవడం లేదంటున్నారు రఘురామ. సీఎం నేరుగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు కాబట్టే ఇదంతా జరిగిందంటున్నారు. అంతేకాదు తనను హింసించడం వెనక జగన్‌ హస్తం కూడా ఉందంటున్నారు. అందుకే కేసులో ఆయన పేరును కూడా చేర్చారు..ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి నోటీసులు వస్తే.. ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత జగన్‌పై డైరెక్ట్‌గా నమోదైన కేసు ఇదే.. అందుకే పోలీసుల విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నిజంగానే పోలీసులు జగన్‌కు నోటీసులు జారీ అయితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? వైసీపీ నేతల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.. ఇది కచ్చితంగా కక్షపూరిత కేసే అనే ఆరోపణలు మనం వింటాం.. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ రఘురామ కూడా ఇదే వర్షన్ చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని.. హింసించారని..మరి ఏది నిజం? ఏది అబద్ధం అనేది విచారణలో తేలనుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్