తెలంగాణలో మహిళలకు రూ.2,500, పింఛన్ల పెంపు
ముహూర్తం ఫిక్స్..!!
Rs.2,500 hike in pension for women in Telangana
Muhurtham fixed..!!
హైదరాబాద్
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు, పెండింగ్ లో ఉన్న రెండు పథకాలను అమలుకు సిద్దమవుతున్నారు.
మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది.
ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.



