రూ. 55 లక్షల ఆల్పోజోలం పట్టివేత..
Rs. 55 lakh Alpozolam seized..
ఆల్పోజోలం తయారీ పరిశ్రమలో సామాగ్రి స్వాధీనం
ఐదు గురిపై కేసు నమోదు ..
ఇద్దరి అరెస్టు
ఆంధప్రదేశ్‌లో మూతపడిన కోళ్ల ఫారాల్లో రహస్యంగా ఆతి భయంకరమైన మత్తు మందుగా పిలువడే నిషేదిత ఆల్పోజోలం ను, తయారు చేసే యంత్ర సామాగ్రితోపాటు, రూ. 55 లక్షల విలువ చేసే ఆల్పోజోలంను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ టీమ్‌లు పట్టుకున్నాయని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఎస్ టి ఎఫ్ ఏ టీమ్ ఎక్సైజ్‌సూపరిండెంట్ అంజి రెడ్డి, ఎస్ టి ఎఫ్ సీ టీమ్ సీఐ నాగరాజు బృందాలు కలిసి శుక్రవారం దాచ్‌పల్లి అద్దంకి నార్కోటిక్‌పల్లి రహదారిలో మిర్యాలగూడ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు.
అద్దంకి నుంచి వస్తున్న మారుతి కారును నిలిపి తనిఖీలు చేశారని తెలిపారు.
ఈ తనిఖీల్లో కారులో 700 గ్రాముల ఆల్పోజోలం లభించింది. ఈ ఆల్పోజోలం ఎక్కడి నుంచి తీసుక వస్తున్నావనే ప్రశ్నలకు నిందితుడు రాజశేఖర్‌రెడ్డి దర్శి తాలుక, ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరం ప్రాంతంలో ఉన్న కోళ్ల ఫారాల్లో ఆల్పోజోలం తయారు చేస్తున్నారని తెలిపాడని చెప్పారు.
నిందితుడితోపాటు మిర్యాలగూడ ఎక్సైజ్ పోలీసులతో కలిసి రాజుగారి చెరువుల వద్ద ఉన్న కోళ్ల ఫారాల్లో అల్ఫాజూలం తయారీ పరికరాలు, 4.67 కేజీల ఆల్పోజోలం లభించిందని తెలిపారు.
రూ. 55 లక్షల విలువ చేసే 5.35 కేజీల ఆత్పోజోలం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఆల్పోజోలం తయారీకి వినియోగించే ముడి పదార్థాలు, తయారుకు వినియోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఆల్పోజోలంను రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన డి. వెంకటరెడ్డి ఏడు అంచల్లో తయారు ఆయ్యే ఆల్ఫా జోలంను ఐదు అంచెల వరకు తయారు చేసి ఇస్తాడని, కెమికల్ ఇంజనీరింగ్‌గా అనుభవం ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఐదు అంచెల్లో వచ్చిన ఆల్పోజోలంను ఏడు అంచేల్లో తయారు చేసి హైదరాబాద్‌లోని వ్యాపారులకు అమ్మకాలు జరుపు తాడని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని బిచ్చు వెంకటేశంకు, కామారెడ్డి చెందిన ఆర్. ప్రసాద్ గౌడ్‌కు అమ్మకాలు జరుపుతున్నట్లు నిందితుడు అంగీకరిం చాడని తెలిపారు.
ఈ కేసులో కోళ్ల ఫారాల వద్ద ఉన్న ఆల్పోజోలం తయారీ పరికరాల వద్ద ఉన్న చైతన్య కృష్ణను ,ఆల్పోజోలంతో పట్టుబ డిన రాజశేఖర్‌రెడ్డిని ఆరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని డైరెక్టర్
విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు.