అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్ మార్చ్ 20
: రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 2500 నుంచి రూ. 3000 మధ్య ఇస్తే సరిపోతాయని నిర్ణయించాం. కానీ కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి.. రైతులకు మించి ఏం ఉండదని ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహారం ఇచ్చారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు..? పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు దేనికి సరిపోతాయి. రైతులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా..? అని మాట్లాడారు. ఇప్పుడు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.మీ చర్యల వల్ల, కరెంట్.. నీళ్లు ఇవ్వక ఎండిపోయిన పంటలు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయాలి. అలాంటి రైతులకు కూడా రూ. 10 వేలు ఇచ్చేందుకు ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర కోట్ల మంది సేద్యాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
100 రోజుల్లోనే రూ. 16,400 కోట్ల అప్పు
ప్రపంచంలోని సంపన్న దేశం అమెరికా నుంచి పేద దేశాల వరకు అప్పులు అనేది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపదను సృష్టిస్తారు. వారు అలా ఎకానమీని పెంచుకుంటారు. అప్పులు ఏదో కేసీఆర్ తన ఇంటి కోసం చేసినట్టు నీచంగా, చులకనగా మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ అప్పులు చేశాడు అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 100 రోజుల్లోనే రూ. 16,400 కోట్లు ఎలా అప్పు చేశారు. ఏదైనా మాట్లాడే ముందు స్పృహతో మాట్లాడాలని రేవంత్‌కు నిరంజన్ రెడ్డి సూచించారు.
నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం డిమాండ్
- Advertisement -
- Advertisement -