30.8 C
New York
Sunday, June 23, 2024

సంచలనాలకు, సంస్కరణలకు పెట్టింది పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్‌

- Advertisement -

సంచలనాలకు, సంస్కరణలకు పెట్టింది పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
       బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
హైదరాబాద్‌ ఏప్రిల్ 20
సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   అన్నారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ఆయన తన ఆరేండ్ల పదవీకాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారని చెప్పారు. ఐపీఎస్‌గా పదవీలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఆయనే ఆద్యుడని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారని గుర్తుచేశారు. తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారని తెలిపారు.తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యావిప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనదని చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారని తెలిపారు. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారని వెల్లడించారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్‌లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయమని, మన సమస్యల పరిష్కారం తథ్యమన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలమంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ వీడియోని విడుదల చేసింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!