స్వర్ణగిరి కి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
హైదరాబాద్, జూన్ 27,
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవలే ప్రారంభమైన స్వర్ణగిరి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే భక్తులంతా ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.ఇక వీకెండ్,సెలవు దినాల్లో అయితే విపరీతంగా రద్దీ ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఆలయానికి దర్శనానికి వస్తూ ఉండగా…..హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువగా భక్తులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి అలాయనికి ప్రత్యేక బస్సులు నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే నేటి నుంచే ఈ ప్రత్యేక సర్వీస్ బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి అని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి రెండు ఈ – మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసి బస్సులను ఆలయానికి నడపనునట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులు ప్రతీ రోజూ ఉదయం 7,8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయల్దేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి. ఇక మధ్యాహ్నం 2:50,3:50 గంటలకు తిరిగి ఆలయాం నుంచి హైదరాబాద్ బయలుదేరుతాయి. ఇక ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఆ ఆలయానికి ప్రతిరోజూ ఉదయం 7:30,8:30,10:30,11:35 గంటలకు అలాగే మధ్యాహ్నం 3:20 గంటలకు, సాయంత్రం 4:20,6:25,7:25 గంటలకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. స్వర్ణగిరి ఆలయం నుంచి జేబియస్ బస్ స్టేషన్ కు మధ్యాహ్నం 12:10,1:10 గంటలకు అలాగే రాత్రి 8,9 గంటలకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఆలయం నుంచి తిరిగి ఉప్పల్ క్రాస్ రోడ్స్ సాయంత్రం 4:45,5:45 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే జేబీఎస్ నుంచి వెళ్లే బస్సులో ఒక్కొకరికి టికెట్ ధర రూ.100, ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్లే బస్సులో రూ.80 గా అధికారులు నిర్ణయించారు.
స్వర్ణగిరి కి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
- Advertisement -
- Advertisement -