Wednesday, April 22, 2026

“రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా పరిష్కారం కాని ఆర్టీసీ కార్మికుల సమస్యలు – హరీష్ రావు విమర్శ”

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది
ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట

“RTC Workers’ Issues Remain Unresolved Even After Two and a Half Years of Congress Rule – Harish Rao Criticizes”
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది. అయినా ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన్పటినుంచి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా.ఇప్పటికి అతిగతి లేదు ఈ నేపథ్యంలోనే కార్మికులు సమ్మెకు దిగాల్సివచ్చింది.  పొన్నం ప్రభాకర్ అధికార దాహాంతో కార్మికుల సమస్యలను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు,ఆయన మాట్లలను తీవ్రంగా కండిస్తున్నాని అన్నారు.
గత రెండు అంసెబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ తరుపున అడుగుతూనే ఉన్నాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని మ్యానిఫెస్టోలో పెట్టిన దానిని కూడా అమలు చేయకపోవడం.కాంగ్రెస్ ద్వంద వ్యఖరికి అద్దంపడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి లేదా రెండు పీఆర్సీలు ఇచ్చి..యూనియన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ ముందు తాము వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గెలిచాక మొఖం చాటేసి,కార్మికులను తీవ్రంగా మోసం చేసింది. హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీ ఎంప్లాయిస్ ని జిల్లాలకు పంపించి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతుంది. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు ఇది హైదరాబాద్ తో ఆగదు,ఇప్పటికే కరీంనగర్, కమ్మం, నిజామబాద్, వరంగల్ డిపోలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు మహాలక్ష్మి పేరుమీద 9వేల 2 వందల కోట్లు ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ సొమ్ము ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా ఏం చేశావని ప్రశ్నిస్తున్నా. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కూడా లేకుండా చేసి నిలువు ద్రోహం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ పైసల్ కట్టండి అని కోర్టు మొట్టికాయలు వేసిన ఇంతవరకు ఆ పైసలు ఇవ్వలేదు, కార్మికుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే సమయం అతి తర్వలోనే ఉందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్