- Advertisement -
రైతు బంధు పైసలు బుక్కిన ఏఈఓ
రూ. 36 లక్షలు రైతుల సొమ్మును స్వాహా చేసిన ఏఈఓ
గద్వాల – గట్టు మండలం బలిగేర ఏఈఓ దివ్య 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖకు పంపకుండా బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి రూ. 36 లక్షలు కాజేసింది.
బలిగేరికి చెందిన ఓ రైతు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా రికార్డుల్లో పాస్‌బుక్ నంబర్లు సరిగా ఉన్నా నగదు ఇతరుల ఖాతాల్లో పడుతున్నట్టు గుర్తించి బాధ్యురాలైన ఏఈఓ దివ్యను సస్పెండ్ చేశారు.
- Advertisement -