Sunday, September 8, 2024

అయోధ్యకు సచిన్, కోహ్లీ

- Advertisement -

లక్నో, డిసెంబర్ 7, (వాయిస్ టుడే): అయోధ్య రాం మందిర్‌ ప్రతిష్ఠాపన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు దేశంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సాధువులు, రామభక్తులు హాజరవుతారు. అటు ప్రముఖులను కూడా పిలవనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీకి ఇన్‌విటేషన్‌ వెళ్లగా తాజాగా పలువురు సెలబ్రెటీలకు సైతం ఆహ్వానం పంపారు. జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ ఇద్దరూ ఆహ్వానాన్ని అంగీకరించి ఈవెంట్‌కు హాజరైతే, క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఒకే మతపరమైన కార్యక్రమంలో కనిపిస్తారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు 8వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపనున్నారు. లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా లాంటి ప్రముఖులు ఉన్నారు.

Sachin, Kohli to Ayodhya
Sachin, Kohli to Ayodhya

ఇక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేస్తోందిఅయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆయోధ్య ఒకటి. శ్రీరాముడు ఆ అయోధ్యపురిలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్య నగరం. అయోధ్యను సాకేతపురం అని కూడా పిలుస్తుంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఈ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక పట్టణం. ఫైజాబాద్ జిల్లా ఫైజాబాద్ ను ఆనుకుని..సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. ఒకప్పటి కాలంలో అయోధ్య పట్టణం కోసలరాజ్యానికి రాజధానిగా ఉంది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్