Friday, March 6, 2026

ట్యాంకు బండపై సద్దుల బతుకమ్మ

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే):  బతుకమ్మ సంబరాలు… తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలై 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో  ప్రత్యేకత. చివరిరోజు సద్దుల బతుకమ్మ చేసుకుంటారు. ఆ రోజు సందడి అంతా కాదు. మహిళలు 9రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున  బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను తీసుకుని… మంగళసూత్రానికి పెట్టుకుంటారు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు  చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడతారు. బతుకమ్మ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు.ఈ పూలపండుగ బతుకమ్మ… ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. సద్దుల బతుకమ్మను.. ఆశ్వయుజ అష్టమి నాడు జరుపుకుంటారు. ఆదేరోజు దుర్గాష్టమి. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నంతో ప్రసాదాలు సమర్పించారు. సద్దుల బతుకమ్మ మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ పూలతో బతుకమ్మను తయారు చేసి పూజిస్తారు. సాయంత్రం బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నిమజ్జన వేడుక కన్నులపండువగా జరుగుతుంది. ఆదివారం సద్దుల బతుకమ్మను కన్నులపండువగా నిర్వహించబోతున్నారు.

Saddula Bathukamma on the tank rock
Saddula Bathukamma on the tank rock

ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. లుంబిని పార్క్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆంక్షలు అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ మళ్లింపులు కూడా ఉంటాయని చెప్పారు. తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా అనుమతించరు. అలాగే.. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ దగ్గర బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్ వైపు మళ్లిస్తారు. ఇక.. ఎక్బాల్‌మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తామని చెప్పారు. అలాగే… నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు దగ్గర రాణిగంజ్‌, నెక్లెస్‌రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు.  హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూటర్న్‌ తీసుకొని తెలుగు తల్లి  జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక… సికింద్రాబాద్‌ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించ‌రు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌  వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్‌ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వైపు పంపుతున్నారు.   జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ నుంచి వెళ్లనున్నాయి. సిటీ బస్సులు కూడా కర్బాలా మైదాన్‌ దగ్గర మళ్లిస్తారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే  వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్