సీఎం చంద్రబాబు ను కలిసిన సాయికృష్ణ తల్లి
విజయవాడ
Sai Krishna’s mother met CM Chandrababu.
కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.!




