సారా తయారీ విక్రయ దారుడు అరెస్ట్ ….
Salesperson of Sarah's manufacturing arrested.....అబ్కారీ సిఐ.
10 లీటర్ల నాటు సారా పట్టివేత.. ద్విచక్ర వాహనం సీజ్.
నందికొట్కూర్ ,నవంబర్ :30 : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామంలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి సారా విక్రయదారుడు నుండి10 లీటర్ల నాటుసారా తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంది కొట్టుకూరు ఎక్సైజ్ సిఐ రామాంజనేయులు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు మండలంలో అక్రమ మద్యం,నాటు సారా అమ్ముతున్న వ్యక్తులపై దాడులు నిర్వహించాలని ఆదేశాలు ఉండడంతో నందికొట్కూర్ ఎక్సైజ్ సిబ్బంది శనివారం మండలంలోని కొణిదెల గ్రామంలో దాడులు నిర్వహించగా నీలి షికారి పవన్ అనే వ్యక్తి నాటు సారా అమ్ముతున్న తుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ పద్మనాభం ,శంకర్ నాయక్ ,కుమారి ,కానిస్టేబుల్ సుదీర్ ,శివన్న ,మధు ప్రసాద్, శ్వేతా రాణి పాల్గొన్నారు.




