Saturday, March 21, 2026

సమంత నిర్మాణ సంస్థ ‘శుభం’.. మే 9, 2025న గ్రాండ్‌గా విడుదల

- Advertisement -

సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన చిత్రం ‘శుభం’.. మే 9, 2025న గ్రాండ్‌గా విడుదల

Samantha's production company 'Shubham' to have a grand release on May 9, 2025

ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సమంత సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద శుభం అనే సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. శుభం చిత్రాన్ని మే 9న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.ఆల్రెడీ శుభం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సిబుల్, హ్యూమర్‌తో శుభం చిత్రం అందరినీ పాత కాలానికి తీసుకు వెళ్లేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా ‘శుభం’ను మేకర్లు రూపొందించినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులంతా కలిసి పని చేశారు.వివేక్ సాగర్ ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం, క్లింటన్ సెరెజో అందించిన మెలోడీ పాటలు ఈ చిత్రానికి హైలెట్ కాబోతోన్నాయి. ఆకర్షణీయమైన కథ చెప్పడంలో ‘శుభం’ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సమంత నిబద్దత అందరికీ అర్థం అవుతోంది.‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్‌తో వినోదాన్ని అందించే చిత్రాలను రూపొందించడమే తన లక్ష్యం. ‘శుభం’  ఆ కోవలోకి చెందే చిత్రం అవుతుంది. ‘శుభం’ కోసం తన టీం ఎంతో కష్టపడింది. ఈ ప్రత్యేకమైన కథను అందరితో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము’ అని సమంత అన్నారు.
మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘శుభం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుందని మేకర్లు చెబుతున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ నుంచి మరిన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాలు రానున్నాయని, ఇలానే వినోదాన్ని అందిస్తామని మేకర్లు చెబుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్