చిన్నారి సాయి సాన్విత ను ఘనంగా సన్మానించిన సనాతన ధర్మ గీత ప్రచార సమితి
Sanatana Dharma Geetha Prachar Samithi honored Chinnari Sai Sanvita
మంథని
శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలలో రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి సాధించిన మంథని కాకతీయ హై స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కందునూరి సాయి సాన్విత ను, ఆమె తండ్రి సంతోష్ ను సనాతన ధర్మ గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. గీత జయంతి ని పురస్కరించుకొని మంథనిలో ఇంటింట భగవద్గీత 555వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, జిల్లా ప్రముఖు కనుకుంట్ల స్వామి, సలహాదారు రామడుగు మారుతి రావు, సనాతన ధర్మ గీత ప్రచారకులు మేడగొని రాజమౌళి గౌడ్, తూర్పాటి రాము, గీతా కమిటీ ఉపాధ్యక్షురాలు గాదె లావణ్య, కాకతీయ హై స్కూల్ హెచ్ఎం ప్రదీప్ రెడ్డి, కాకతీయ హై స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారి సాయి సాన్విత ను అభినందించారు.ఈ సందర్భంలో హెచ్ఎం ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ గీతా ప్రచార సమితి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సనాతన ధర్మ గీతా ప్రచార సమితి తమ కార్యకలాపాలలో సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.