మండలానికి 7 సీజనల్ హాస్టల్స్ మంజూరు…ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు
Sanction of 7 seasonal hostels to Mandal...MEO Rama Venkateshwarlu
కోతికొండ గ్రామంలో సీజనల్ హాస్టల్స్ ప్రారంభించిన ఎంఈఓ.
తుగ్గలి
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తుగ్గలి మండలానికి 7 సీజనల్ హాస్టల్స్ ను మంజూరు చేసిందని తుగ్గలి మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు. సోమవారం రోజున ఎంఆర్సి కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జొన్నగిరి గ్రామానికి 2,ఎర్రగుడి గ్రామానికి 2,పగిడిరాయి గ్రామానికి 1,చెన్నంపల్లి గ్రామానికి 1,కోతికొండ గ్రామానికి 1 సీజనల్ హాస్టల్స్ మంజూరు చేసిందని ఆయన తెలియజేశారు.సోమవారం రోజున మండల పరిధిలోని గల కోతికొండ గ్రామం నందు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు సీజనల్ హాస్టల్ ను ప్రారంభించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూ ఆధారంగా నేటి నుండి అన్ని సీజనల్ హాస్టల్స్ ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సీజనల్ హాస్టల్స్ ను ఏర్పాటు చేసిందని,ఈ సీజనల్ హాస్టల్స్ ను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, ఎద్దులదొడ్డి శీను,తిమ్మప్ప మరియు తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.