సంగారెడ్డి నియోజకవర్గ అధికారుల నా ఇన్ స్టారక్షన్స్  ఫాలో కావాలి

- Advertisement -

అధికారిక కార్యాక్రమాలకు నా భార్యను పిలవాలి

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి: సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే, ప్రియాంక గాంధి సిఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలో మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ పధకం అమలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి నియోజకవర్గ అధికారుల నా ఇన్ స్టారక్షన్స్  ఫాలో అవ్వాలి.  అధికారులు ఎవరు కూడా ఆశ్రద్ధ,నిర్లక్ష్యం వహించొద్దు. ఇక నుండి సంగారెడ్డి నియోజకవర్గం లో జరిగే ప్రతి ఆఫీసియల్ కార్యక్రమాలకు నా భార్య నిర్మల జగ్గారెడ్డి ని పిలవాలని అన్నారు.

ఈ రోజు సోనియా గాంధీ గారి పుట్టిన రోజు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు ఈ రోజు గిఫ్ట్ ఇస్తున్నాము. ఎన్నికలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే, ప్రియాంక గాంధీ మా సిఎం రేవంత్ రెడ్డి  మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలు పెడుతున్నారు.  ఇక నుండి మహిళలు రాష్ట్రంలో ఎక్కడ బస్ లో ప్రయాణం చేసిన టికెట్ అవసరం లేదు ఫ్రీ గా వెళ్ళిరావొచ్చని అన్నారు.

అలాగే ఆరోగ్య శ్రీ పధకం కింద 10లక్షలు అమలు చేయనున్నారు. మిగితా 6 గ్యారెంటీ లో అమలు చేయాల్సిన పధకాలు కూడా త్వరలోనే ఒక్కొకటిగా అమలు చేస్తారు. గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. ఆ సమయంలో సంగారెడ్డి నియోజకవర్గం లో ఓడిపోయినా ఎమ్మెల్యే నే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుచుకొని మొదలు పెట్టేవారని అన్నారు.

కానీ నేను హుందా గా వ్యవహారించాను ..ఏమి అనలేదు అప్పుడు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వాళ్ళ నేను ఓడిపోయినా.. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది.  నా తరుపున ఇక నుండి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల  అటెండ్ అవుతుంది. అధికారులు అందరు నిర్మల కి సమాచారం ఇవ్వాలి. ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సంగారెడ్ట్ నియోజకవర్గ మూడుసార్లు ఎమ్మెల్యే గా చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. అధికారులు ఎవరు ఆశ్రద్ధ, నిర్లక్ష్యం చేయొద్దు. ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 4 మండల ప్రెసిడెంట్ లు,మా గెలిచినా ఓడినా ప్రతి ప్రజా ప్రతినిధులకు,ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా మైనారిటీ, ఎస్సి, ఎస్టీ, బీసి ఇతర అన్ని సెల్స్ కి సంబందించిన నాయకులకు సైతం ఇన్ఫర్మేషన్  ఇవ్వాలని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular