సంగారెడ్డి జిల్లాలో మరోసారి నిషేధిత మత్తుపదార్థాలు పట్టివేత
సంగారెడ్డి
జిల్లాలో మరోసారి నిషేధిత మత్తుపదార్థాలు పట్టివేసారు. మత్తుపదార్థాల అమ్మకాలకు అడ్డాగా దాబా హోటళ్లు మారుతున్నాయని ఆరోపణల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సదాశివపేట (మం) సురారంలోని రాజస్థాన్ దాబాలో మత్తు పదార్థాలు అమ్ముతూ ఇద్దరు నిందితులు దొరికిపోయారు. రాజస్థాన్ కి చెందిన అశోక్, రాకేష్ లను మత్తుపదార్థాలు అమ్ముతుండగా ఎక్సయిజ్ అధికారులు రెడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి హెరాయిన్ తయారు చేసే 355 గ్రాముల మత్తుపదార్థం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి మత్తుపదార్థాలు తెచ్చి దాబాకి వచ్చే వారికి అమ్ముతున్నట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం నందికందిలోని రాజస్థాన్ దాబాలోను మత్తుపదార్థాలు పట్టుకున్నారు
సంగారెడ్డి జిల్లాలో మరోసారి నిషేధిత మత్తుపదార్థాలు పట్టివేత
- Advertisement -
- Advertisement -