- Advertisement -
సామజిక స్పృహ గల వ్యక్తి సంజీవ రాయుడు-డోన్ యం ఈ ఓ ప్రభాకర్
Sanjeeva Rayudu-Don Yam Eo Prabhakar is a socially conscious personడోన్
సామజిక స్పృహ గల వ్యక్తి డాక్టర్ అనుగోలు సంజీవ రాయుడు అనీ డోన్ యం ఈ ఓ ప్రభాకర్ అన్నారు, స్థానిక డోన్ యం ఈ ఓ కార్యాలయం లో విజయవాడ వరద భాదితులకు సహాయార్థం కోసం డోన్ మండలం గోశానిపల్లి గ్రామం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల తెలుగు పండితుడు సంజీవ రాయుడు 2500/-రూపాయల చెక్కు ను యం ఈ ఓ ప్రభాకర్ కు అందజేశారు, ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ సంజీవ రాయుడు ను అభినందిచారు, సామాజిక స్పృహకలిగి ఉండి ,మరియు విద్యార్థులకూడ సామాజిక స్పృహ, సేవభాద్యతలు గురించి తెలియజేస్తూ ఉండడం, మరియు కవిగా,రచయితగా, సాహిత వేత్తగా డాక్టర్ సంజీవ రాయుడు ను
అభిందించారు,సంజీవ రాయుడు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ధర్మం అనీ,పరులకోసం పాటుపడని నరునీ బ్రతుకు వ్యర్థం అనీ,”సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికీ తోర్పాడువోయ్”అన్న గురజాడ సాక్షిగా నేను అడుగులేస్తున్నను అనీ డాక్టర్ సంజీవ రాయుడు అన్నారు, ఈ కార్యక్రమం లో తోటి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -




