Thursday, April 24, 2025

సన్న వడ్ల బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ

- Advertisement -

సన్న వడ్ల బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ

Sanna Vadla bonus is deposited in the accounts of Sommu farmers

– 8.46 కోట్లు జమ

– ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశంలో  అదనపు కలెక్టర్ వేణు
పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లాలో సన్న రకం వడ్లకు బోనస్ కింద ఇప్పటి వరకు 8 కోట్ల 46 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని  అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు. శనివారం  అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ  జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు ప్రతిపాదించగా, 320 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 268 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని అన్నారు.  రామగుండం, మంథని తదితర ప్రాంతాలలో కోతలు ఆలస్యంగా జరుగుతాయని, అక్కడ మినహా ప్రతి చోట దాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 వేల 829 మంది రైతుల నుంచి 189 కోట్ల 15 లక్షల రూపాయల విలువ గల 81 వేల  537.94 మెట్రిక్ టన్నులు ఇందులో దొడ్డు రకం 31 వేల 701, సన్న  రకం 49  వేల 836 కోనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామన్నారు.  రైతులకు 80 శాతం మేర 151 కోట్ల 20 లక్షల రూపాయల ధాన్యం డబ్బులు వారి ఖాతాలలో జమ చేశామని తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకు 4051 మంది రైతులకు 15 కోట్ల 34 లక్షల రూపాయలు బోనస్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసామని, ఇప్పటి వరకు 8 కోట్ల 46 లక్షల బోనస్ రైతులకు చెల్లించిందని అన్నారు. ప్రతి మండలానికి 2 ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షిస్తున్నామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టామని అన్నారు.  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33 రకాల సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు సర్టిఫై చేస్తున్నారని అన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడ్ క్లీనర్, తేమ యంత్రాలు, 334 హజ్ క్లీనర్, అవసరమైన గన్ని సంచులు అందుబాటులో పెట్టామని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగు నీరు విద్యుత్ సౌకర్యం కల్పించామ ని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్