Monday, October 14, 2024

వందకు చేరిన సన్నబియ్యం..మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

- Advertisement -

వందకు చేరిన సన్నబియ్యం..మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

Sannabiyam reached hundred.. Prices of essential commodities are burning

హైదరాబాద్, అక్టోబరు 1, (వాయిస్ టుడే)
సన్న బియ్యం ధర కిలో రూ.వందకు చేరనుందా..? కూరగాయల ధరలూ కిలో రూ.80 పైనే వుండబోతున్నాయా..? ఇప్పటికే రూ.220 పైగా ఉన్న వంట నూనెలు మరింత వేడెక్కుతాయా…? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పాలసీలతో సామాన్యుల నెత్తిన ధరల పిడుగు పడుతోంది. నిత్యావసర ధరలు రోజు, రోజుకీ పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి జీవులకు కుటుంబ పోషణ భారమవుతున్న దయనీయ స్థితి ఎదురవుతోంది.గతేడాది జూన్ నుంచి సన్నబియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ధీంతో ఇకపై తెలంగాణ మిల్లర్లు సన్న బియ్యాన్ని అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు స్వేచ్ఛగా ఎగుమతి చేస్కోవచ్చు. దాదాపు 145 దేశాల్లో మన సన్న బియ్యానికి డిమాండ్ ఉంది. సన్న బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తే అధిక ధర, లాభాలు వస్తుండడంతో స్థానికంగా సన్న లభ్యత తగ్గనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.60 నుంచి రూ.70 కి చేరింది. తాజా పరిణామాలతో ఈ ధర అతి త్వరలో రూ.వంద కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సామాన్యులకు అందుబాటు ధరలో సన్న బియ్యం ఉండేలా నియంత్రణ చేపట్టాలనే డిమాండ్ వస్తున్నా, మిల్లర్ల లాబీని ప్రభుత్వం నియంత్రిచడం సాధ్యమయ్యే పనేనా అనే సందేహం వెల్లడవుతోంది.బియ్యం ధరలు చుక్కల్లోకి చేరితే కూరగాయల, వంట నూనెల ధరలూ అదే బాటలో ఉన్నాయి. కూరగాయల సాగు డిమాండ్ మేర లేకపోవడం, దిగుబడులు లేకపోవడంతో వాటి ధరలు పల్లెలు, చిన్న పట్టణాల్లోనే కిలో రూ. 60 నుంచి రూ.80 వరకు ఉంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. రైతు బజార్లను ఏర్పాటు చేసినా వాటిల్లోనూ దళారీలు, వ్యాపారులే తిష్ట వేయడంతో ధరలకి నియంత్రణ లేకుండాపోయింది. వంట నూనెల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెలు సామాన్యులకు అందడం లేదు. కిలో రూ.200 , రూ.230 కి వీటి ధరలు చేరాయి. రీఫైండ్ ఆయిల్స్ పేరుతో రేట్లు అడ్డగోలుగా పెంచినా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. పామాయిల్ ధర సైతం కిలో రూ.130 వరకు చేరింది.నిత్యావసర వస్తువుల ధరలన్నీ అడ్డగోలుగా పెరిగిపోతుండడంతో బతుకు భారమైన సామాన్యులు వీటిని రేషన్ దుకాణాల ద్వారా కనీస ధరకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సన్న బియ్యం, వంట నూనెలు, చక్కెర, ఉల్లిపాయలు, కూరగాయలు, కందిపప్పు, చింతపండు ని రేషన్ దుకాణాల్లో కనీస ధరకి అందించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్