Wednesday, April 23, 2025

ఈ నెల 25 న ‘సారంగపాణి జాతకం’

- Advertisement -

ఈ నెల 25 న ‘సారంగపాణి జాతకం’

'Sarangapani Horoscope' for the 25th of this month

హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చాలా ఇష్టపడి  చేసిన సినిమా ‘సారంగపాణి జాతకం‘. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది . యూత్ ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నెల 25 న సమ్మర్ కూల్ స్పెషల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “ మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమా తో నెరవేరింది. ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ నెల 25 న మీకు  రెట్టింపు ఆనందాన్ని కలిగించే విధంగా మా ‘సారంగ పాణి జాతకం‘ థియేటర్ల లో విడుదల కానుంది. నిజానికి 18 న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు , మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం. ’బలగం ‘, ‘35’, ‘కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది. మిమ్మల్ని ఈ సినిమాతో 100 శాతం ఎంటర్టైన్ చేస్తారాయన. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ ‘నాని జెంటిల్‌మన్’ . ఆ తర్వాత చక్కని ప్రేమకథతో, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ . ఈ రెండూ కూడా మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ‘సారంగపాణి జాతకం’ కొనసాగిస్తుంది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.“ అని తెలిపారు.
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్