జల దీక్ష చేసి నిరసన తెలియజేసిన సత్య సాయి కార్మికులు

- Advertisement -

జల దీక్ష చేసి నిరసన తెలియజేసిన సత్య సాయి కార్మికులు

Sathya Sai workers protested by Jala Deeksha

పుట్టపర్తి
పుట్టపర్తి నియోజకవర్గంలో  సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. కార్మికులు  జల దీక్ష చేసి నిరసన తెలియజేసారు.  కొత్తచెరువులో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు.  మా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని  బుక్కపట్నం చెరువులో నాగుల కనుమ వద్ద నడుములోతు నీటిలో నిలబడి సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని… వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  కార్మికులు పూర్తిగా విధులు బహిష్కరించడంతో  తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
తాగునీటి పథకం ప్రారంభమైనప్పటి నుంచి చాలీచాలని జీతాలతో పని చేస్తున్న ఆ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular