- Advertisement -
అన్ని వర్గాల సంతృప్తి మా లక్ష్యం- బీసీ కమిషన్ చైర్మన్
Satisfaction of all communities is our goal - BC Commission Chairman
వాయిస్ టుడే, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ చైర్మన్‌గా బీసీ సంక్షేమ కమిషన్ ఏర్పాటైంది. బీసీ వర్గాల సాధికారతపై దృష్టి సారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
బీసీ కమిషన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జి. నిరంజన్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి ఉంటారు. జనాభాలో వెనుకబడిన తరగతుల వర్గాల శాతాన్ని లెక్కించిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు నిర్ణయించేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేశారు.. శుక్రవారం జారీ చేసిన వేర్వేరు ఉత్తర్వుల్లో, నియామకానికి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను సంబంధిత శాఖలు విడివిడిగా జారీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం సాధించేందుకు ఇది ముందడుగు అని, సామాజిక గణన చేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అభివర్ణించారు. అంకితభావంతో పనిచేసేవారికి కాంగ్రెస్ తగిన గుర్తింపును ఇస్తుందని, అందుకు నిరంజన్ ఉదాహరణ అన్నారు. జాతీయస్థాయిలో కులగణనకు రాహుల్ గాంధీ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని, పీసీసీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ఓబీసీలకు సముచిత స్థానం ఇస్తుందని, పదవులతో పాటు పథకాల్లో కూడా వారికి పెద్దపీట వేస్తుందన్నారు.
కులగణన నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్, సభ్యుల నియామకం కీలకంగా మారింది.
బీసీ కమిషన్ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం బీసీ కులగణన చేస్తేనే సమస్య పరిష్కారం కాదు.. అన్ని కులాల గణన చేస్తేనే పరిష్కారం అవుతుంది. ఇప్పటి నుండే బీసీ కులాల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లపుడు సిద్ధమే అని అన్నారు.. నాన్-పొలిటికల్ గా సమస్య ఎలా తేల్చుకోవాలి అని ప్రయత్నాలు చేస్తాను.. ప్రభుత్వం సహకరిస్తుంది అని ఆశిస్తున్నాము అలానే త్వరగా బీసీ కమిషన్ కి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం నుండి పొందే ప్రయత్నం చేస్తాము. సమాజంలో అన్ని వర్గాలు సంతృప్తి అయేలాగా చూస్తాం అన్నారు. కుల గణన అనేది క్షేత్ర స్థాయిలో చేయాలి ఒక్కరోజులో చేసే పని కాదు. కానీ గత ప్రభుత్వము కుల గణన చేసి ఏం లాభం..? ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. 55 సంవత్సరాల నుండి సామాజిక కార్యకర్త గా నిబద్ధత తో పని చేశాను కాబట్టే పార్టీ బీసీ కమిషన్ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. చిత్తశుద్ధితో బీసీ కుల గణన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ – కీలక అంశాలివే:
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంపు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో కూడా రిజర్వేషన్లు కేటాయింపు.
జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు
బీసీ సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయింపు.
ప్రతి మండలంలో బీసీలకు ప్రత్యేక గురుకులాలు.
జిల్లా కేంద్రాల్లో బీసీలకు ప్రత్యేక భవనాల నిర్మాణాలు.
బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లింపు.
ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ A లోకి మార్చటం
మత్స్య అభివృద్ధికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు.
మద్యం షాపుల కేటాయింపుల్లో గౌడ్లకు రిజర్వేషన్లు 15 నుంచి 25 శాతానికి పెంపు.
జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు
తెలంగాణ మున్నూరు కాపు రిజర్వేషన్ ఏర్పాటు.
పద్మశాలల పవర్ లూమ్స్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ.
విశ్వకర్మలకు 90 శాతం సబ్సిడితో టూల్ కిట్లు.
50 కోట్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్య భవన్‌లు నిర్మిస్తామని, జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయాన్ని ఈ భవన్‌లలో ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. BC యువత చిన్న వ్యాపారాలను స్థాపించడానికి మరియు ఉన్నత విద్యను పొందేందుకు 10 లక్షల వరకు వడ్డీ రహిత మరియు తాకట్టు లేని రుణాలను పొందవచ్చు. ప్రతి మండలంలో 50 దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ “వృతి బజార్లు”గా బార్బర్లు, వడ్రంగులు, చాకలివారు, కమ్మరులు మరియు స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారికి ఉచిత దుకాణ స్థలాన్ని అందించడానికి డిక్లరేషన్‌లో భాగం. హస్తకళా వృత్తిలో నిమగ్నమైన అన్ని వర్గాలకు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును ప్రస్తుత 57 నుండి 50 సంవత్సరాలకు తగ్గించడం” అని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ప్రస్తుతం, కల్లు కుట్టేవారు మరియు నేత కార్మికులకు మాత్రమే అర్హత వయస్సు 50 సంవత్సరాలు.. ముదిరాజ్ కమ్యూనిటీ మరియు ఇతర సంబంధిత కులాలు ‘ముత్రాసి మరియు తెనుగొల్లు’ రిజర్వేషన్ కేటగిరీలో BC-D నుండి BC-Aకి మార్చబడుతుంది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) పునరుద్ధరణ.ముదిరాజ్ సంఘం జనాభాలో 11% మంది ఉన్నారు. తెలంగాణ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు కూడా ఏర్పాటు కానుంది అని హామీ ఇచ్చారు.
- Advertisement -