Monday, May 11, 2026

డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు..

- Advertisement -

డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు..

Savings societies for men like Dwakra societies.

విశాఖపట్టణం, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. తద్వారా మహిళలకు ఎంతో మేలు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా డ్వాక్రా సంఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇదే తరహాలో పురుషులకూ స్వయం ఉపాధి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పురుషులకూ పొదుపు సంఘాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్టణంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించనున్నారు. అయితే, గత నెలలో వెయ్యి సంఘాలు ఏర్పాటు కాగా.. మార్చి నెలాఖరు నాటికి మరో రెండువేల సంఘాల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (ఎన్ యూఎల్ఎం) 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలివస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించడమే. సంఘాల ఏర్పాటు ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటు చేయించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణాలిప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరఫరా చేసే గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడుబళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో, ఇళ్లలో పనిచేసేవారు. వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులు. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రతీనెలా సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్ఠంగా రూ.100 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. తొలిదశలో పురుషుల పొదుపు సంఘాలకు సంబంధించి 2841 గ్రూపులను నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల నుండి సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. నెల రోజుల్లోనే 1028 పురుషుల సంఘాలు ఏర్పడడంతో, మార్చి 31 నాటికి తమ టార్గెట్ ను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ప్రధానంగా పురుషుల పొదుపు సంఘాల ద్వారా రోజువారి కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.అయితే పురుషుల పొదుపు సంఘాలలో ఎవరైనా చేరెందుకు కొన్ని నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది. 18 నుండి 60 ఏళ్ల మధ్యగల వయసు గలవారు అర్హులని, ఐదుగురు పురుషులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు కావచ్చు. అలాగే గ్రూప్లో సభ్యుడిగా చేరే వ్యక్తి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రతినెలా కనీసం రూ. 100 నుండి రూ. 1000 వరకు పొదుపు చేసే అవకాశం ఈ సంఘానికి కలుగుతుంది. ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం.. రూ. 25 వేలు అందజేయనుంది. ఆసక్తి కలిగిన పురుషులు స్థానిక మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే చాలు పురుషుల పొదుపు సంఘం గ్రూపు ఏర్పాటు చేస్తారు. మరెందుకు ఆలస్యం.. పొదుపు సంఘంలో చేరండి.. ఆర్థికంగా బలోపేతం కండి.మూడు నెలల తరువాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా రూ. 1.50 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందొచ్చు.దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో కేంద్రం పురుషుల పొదుపు సంఘాల కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది అమలు చేయనుంది. ఇందులో ఏపీ నుంచి విజయవాడ, విశాఖ పట్టణాలు ఉన్నాయి. అయితే, దశల వారిగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రెండో దశలో.. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయితే, సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపుకోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించనున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్