Tuesday, March 18, 2025

సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే :పుట్ట మధూకర్‌

- Advertisement -

సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే

-చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది

-చదువుకు కారణమైనోళ్ల గురించి తెలియకపోవడం దురదృష్టకరమే

-త్వరలో సావిత్రీబాయిపూలే విగ్రహం ఏర్పాటు చేస్తం

-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

Savitribai Phule is said to be a role model for women: Putta Madhukar

మహిళలకు అక్షరజ్ఞానం నేర్పిన సావిత్రీబాయి పూలే మహిళాలోకానికి ఆదర్శమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, అయితే ఆమె గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.
చదువులతల్లి సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్బంగా సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగువర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా దేశంలో కొనసాగుతోందన్నారు.
ఆనాడు అణగారిన వర్గాలతో పాటు బ్రాహ్మణమహిళలను చదువుకు దూరంగా ఉంచిన సందర్బంలో మహాత్మాజ్యోతిరావుపూలే తన సతీమణి సావిత్రీబాయికి చదువు నేర్పించి మహిళలకు అక్షరాలు నేర్పించేలా ప్రోత్సాహం అందించారన్నారు. ఆనాడే మహిళల కోసం పాఠశాలను స్థాపించిన  సావిత్రీబాయి పూలే చరిత్ర గురించి చెప్పాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ సమాజంపై ఉందన్నారు. ఆడవాళ్లు చదువుకోలేని సమయంలో వారికి అక్షరాలు నేర్పించారని, ఆనాడు ఆమె నేర్పించిన అక్షరజ్ఞానంతోనే ఈనాడు ఎంతో మంది ప్రయోజకలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. చదువు రావడానికి, చదువుకోవడానికి కారణమైన సావిత్రీబాయి పూలే గురించి తెలియకపోవడం దురదృష్ణకరమని, సావిత్రీబాయి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు భుజాన వేసుకుని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల చరిత్ర  తెలిసేలా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని, త్వరలోనే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా మంథనిలో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఏగోలపు శంకర్ గౌడ్, ఎక్కేటి అనంతరెడ్డి, ఆరేపల్లి కుమార్, కాయితి సమ్మయ్య, గొబ్బూరి వంశీ, మంతిని లక్ష్మణ్, విజయ్ కుమార్, బండారి శ్రీకాంత్, జావేద్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్