- Advertisement -
వడ్డీరేట్లను పెంచిన ఎస్బీఐ
SBI increased interest rates
ముంబై, నవంబర్ 15
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ని ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితి కలిగిన రుణాలపై మాత్రమే వడ్డీరేట్లను సవరించింది.దీంట్లోభాగంగా ఏడాది కాలపరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీరేటును 0.05 శాతం సవరించడంతో రేటు 9 శాతానికి చేరుకున్నది. ఈ రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. మూడు, ఆరేండ్ల కాలపరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు సవరించిన బ్యాంక్.. నెల, రెండేండ్లు, మూడేండ్ల రుణాలపై వడ్డీని యథాతథంగా ఉంచింది. గత కొన్నిరోజుల్లో ఎంసీఎల్‌ఆర్‌ని రెండు సార్లు సవరించింది.
- Advertisement -