Thursday, January 23, 2025

ఎస్సీ వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలి

- Advertisement -

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో
విశ్వరూప మహాసభ
కరపత్రం ఆవిష్కరణ
నవంబర్ 11న చలో హైదరాబాద్

జగిత్యాల: హైద్రాబాద్ లో ఈ నెల 11 న జరుగనున్న మాదిగల విశ్వరూప మహాసభకు దేశ ప్రధాని మోడీ రానున్నారని ఈ సభను విజయవంతం చేయాలని ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం కోరారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లోఎంఎస్పి, ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో “మాదిగల విశ్వరూప మహా సభ” కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ ఎస్సీ లలో ఉండే 59, ఉపకులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రకారం సమాన వాటా పంపిణీ జరగాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి జరగాలన్నారు.  దీనికై   మంద కృష్ణ మాదిగ 29, సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు.  ఎమ్మార్పీఎస్ ఉద్యమ పోరాటం వల్ల నే సాధించిన సంక్షేమ పథకాలను  తెలియజేసి వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ తో నవంబర్ 11, న లక్షలాది మందితో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ఈ మహా సభకు ముఖ్య అతిధిగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నందున మన జాతి ఆవేదను చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. మన భవిష్యత్తు కొరకై విశ్వరూప మహాసభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కో కన్వీనర్ బెజ్జంకి సతీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ సురుగు శీను, కో కన్వినర్ బలవంతుల సురేష్, జగిత్యాల నియోజకవర్గ కన్వీనర్ బోనగిరి కిషన్, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు లక్ష్మీరాజ్యం, దయ్యాల అనుమంతు, బంగారు ప్రమోద్, కుంటాల శ్రీనివాస్, పెంబట్ల మీసాల సాయిలు, చిర్ర లక్ష్మణ్, న్యాయవాది నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్