29.6 C
New York
Wednesday, June 19, 2024

భయపెడుతున్న రెస్టారెంట్లు

- Advertisement -

భయపెడుతున్న రెస్టారెంట్లు
హైదరాబాద్, మే 27, (వాయిస్ టుడే )
వీకెండ్స్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేందుకు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు. ఇలా రెస్టారెంట్లకు వెళ్లే భోజన ప్రియులకు మాత్రం ఊహించిన షాక్ కి గురి అవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని కొన్ని రెస్టారెంట్లో సీటు దొరకాలంటే కనీసం గంట నుంచి రెండు గంటల పాటు వేచి చూడాల్సినా పరిస్థితి..!అయితే ప్రస్తుతం అంతటి రద్దీ ఇప్పుడు కనిపించడం లేదు భాగ్యనగరంలో రెస్టారెంట్లు. సమయం, సందర్భం లేకుండా ఐస్ క్రీములు, కేక్స్ లాగించే యువత తమ అలవాటును కొనసాగించడానికి భయపడుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న వరుస రైడ్స్‌లో.. ఫుడ్‌లవర్స్‌కే కాదు, సాధారణ జనాలకూ దిమ్మ తిరిగిపోయేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. చాలా హోటెల్స్‌లో కుళ్లిన పదార్థాలతో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారని నిర్ధారించారు తనిఖీ అధికారులు. కనీస శుభ్రత పాటించకుండా… రోజుల తరబడి స్టోర్‌చేసిన మాంసాన్ని .. వేడివేడిగా వడ్డిస్తూ.. జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్టు తేల్చారు. ఇప్పటికే పలువురు బాధితులు.. తమకు అనారోగ్య స్థితికి కారణమైన హోటెల్స్‌పై కేసులు కూడా నమోదు చేశారు.గల్లీకో హోటెల్‌… రోడ్డుకో రెస్టారెంట్‌… విచ్చలవిడిగా వెలుస్తున్న ఫుడ్‌సెంటర్లు.. దీంతో విపరీతమైన కాంపిటీషన్‌ ఏర్పడింది. ఎలాగైనా సక్సెస్‌ కావాలని.. లాభాలబాట పట్టాలని.. కొన్ని హోటెల్స్‌ వికృతచేష్టలకు దిగుతున్నాయి. ఆహారం మిగిలితే పారేయకుండా.. స్టోరేజ్‌చేసి తర్వాతి రోజుకూడా కస్టమర్లకు వడ్డిస్తున్నారు. వాడిన నూనెలనే మళ్లీమళ్లీ వాడుతూ.. ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. అయితే, ఆలస్యంగా మేల్కొన్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు… ఇప్పుడు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. హోటెల్సన్ననీ FSSI రూల్స్‌ పాటించాలని చెబుతున్నారు.కుళ్లిన ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నవారు.. ఆస్పత్రులకు భారీ సంఖ్యలో వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రత, ప్రాసెస్‌ ఫుడ్‌, స్టోర్డ్‌ ఫుడ్‌ల కారణంగానే.. కడుపునొప్పి, లూస్‌ మోషన్స్‌.. మలంలో రక్తం రావడం.. నీరసించిపోవడం.. వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రైడ్స్‌తో హైదరాబాద్‌లోని రెస్టారెంట్ల నిర్వాహకులంతా అప్రమత్తమయ్యారు. హోటెల్స్‌ యజమానులందరూ… FSSI రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు.నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలు దీనికి కారణం అని తెలుస్తోంది.పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. బయట అంత కళ్ళు చెదిరేలా కలరింగ్, కానీ లోపల అంత కంపే.. రెస్టారెంట్లు, ఐస్‌క్రీం పార్లర్, సూపర్ మార్కెట్లు.. ఒకటేమిటి కాదేది కల్తీకి అనర్హం.. కాదేది ఆరోగ్య కారకం అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. హైదరాబాద్ మహా నగరంలో ఫుడ్ లవర్స్ కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లో, బ్రాండెడ్ ఐస్ క్రీమ్ పార్లర్లు.. సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తెలిసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఒక్కో రెస్టారెంట్ అసలు భాగోతాన్ని బయటపెడుతున్నారు.ఈ దాడుల్లో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. మరోవైపు కల్తీ ఉత్పత్తులు నిల్వ ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సంబంధిత యాజమాన్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే లకిడికాపూల్‌లోని ద్వారక హోటల్లో క్యారెట్ హల్వా తిన్న ఓ కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదోక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం బయట ఆహారం అంటేనే నగరవాసులు భయపడుతున్నారు. దీనికి గత మూడు రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై చేస్తున్న రైడ్స్ ఏ కారణం అంటున్నారు.జీజిహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు రెస్టారెంట్లపై దాడులు చేశారు. మాసబ్ ట్యాంక్‌లోని పారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాద్ ఖానా వంటి ప్రముఖ రెస్టారెంట్లలో నిర్వహించిన దాడుల్లో ఇంతటి ఫుడ్ కలర్ ఆహారాన్ని గుర్తించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కిచెన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదని అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా సాగిన దాడుల్లో 100కి పైగా రెస్టారెంట్లు ఫుడ్ జాయింట్స్ పై తనిఖీలు చేసి అసలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో తిండి అంటేనే భయపడుతున్నారు భోజనప్రియులు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!