కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు,పాంచ్ న్యాయ పథకాలు అమలు చేస్తా
— పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి
కూకట్ పల్లి :ఏప్రిల్ 20(వాయిస్ టుడే)
పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన 6 గ్యారంటీలు పాంచ్ న్యాయ పథకాలు అమలు చేస్తామని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గo పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి కూకట్ పల్లి, బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్, స్థానిక నాయకులు కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా అదరక బెదరక పార్టీ విజయానికి కృషి చేశారని, అలాంటి వారిని పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు, రైతు నేస్తం వంటి పథకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సునీత విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లి పార్టీ పట్ల సానుకూలత పెంచాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారు మాత్రమే ఉండాలని గ్రూపులతో తగాదాలతో పార్టీ పరువును దిగజార్చవద్దనీ హెచ్చరించారు. కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని ఆ పార్టీ కార్యకర్తగా ఉండటం గొప్పగా భావిస్తాను అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో 350 నుంచి 400 సీట్లు గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు అన్ని కులాలను అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుందన్నారు. దేశ ప్రజలను బిజెపి అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిందన్నారు పార్టీలో ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరినీ కలుపుకుని పోతామన్నారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలని అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రమేష్ కార్యకర్తలను ప్రజలను గట్టిగా కోరారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఏ, బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి తూమువేణు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



