Tuesday, March 17, 2026

స్కాలర్షిప్స్ విద్యార్థుల భిక్ష కాదు హక్కు-     ఏబివిపి సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ

- Advertisement -

స్కాలర్షిప్స్ విద్యార్థుల భిక్ష కాదు హక్కు-
    ఏబివిపి సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ
పెండింగ్ లో ఉన్న 9,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ మార్చ్ 17

Scholarships are not charity for students, but a right—
ABVP Secunderabad District Convener, Balakrishna
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబివిపి) సికింద్రాబాద్ జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న 9,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేసారు.ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యారంగానికి కనీసం 15శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 20న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. విద్యను బలోపేతం చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా కమీషన్ నివేదికను తిరస్కరించాలని, పెంచిన ఇంజనీరింగ్ ఫార్మా కళాశాలలలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేసారు.విద్యాశాఖకు ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో విద్యారంగానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే విద్యాశాఖమంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌతమ్,బేగంపేట్ టౌన్ సెక్రటరీ పవన్,పీజీ కాలేజీ ప్రెసిడెంట్ అభి, సెక్రటరీ పుండలీక్,శివరాజ్, వెంకట్,రమన్, చెన్నాయ, ఫారహన్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్