సమస్యల కుప్ప గా సికింద్రాబాద్

- Advertisement -

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించని BRS ను బొంద పెడదాం.

కాంపల్లి శ్రీనివాస్ CPI కార్యదర్శి సికింద్రాబాద్

సికింద్రాబాద్, అక్టోబర్ 27, (వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ నియోజకవర్గం సమస్యల కుప్పగా తయారైందని నియోజకవర్గంలోని పార్సిగుట్ట, మెట్టుగూడ, అడ్డగుట్టను, బంజారాహిల్స్’గా మారుస్తానని చెప్పి కనీసం త్రాగడానికి మంచినీళ్లు కూడా కల్పించలేదనీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీని అన్నారు.
మెట్టుగూడ లోని దూద్ బావి బస్తి కమ్యూనిటీ హాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ఆటో యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో
హైదరాబాద్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమురెల్లి బాబు అధ్యక్షతన,
ముఖ్యఅతిథిగా సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ…
పదేళ్లలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలని, అనేక ఆందోళలనలను, నిరసనలు చేపట్టినా నేటికీ…. ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదని,10 సంవత్సరాలుగా పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించిన పెడచెవిన పెట్టి, కమిషన్లకు కక్కుర్తి పడి కార్మికుల రక్తం తాగే ఓలా, ఊబర్ లాంటి వ్యవస్థలను రెడ్ కార్పెట్ వేసి ప్రోత్సహించి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగం చేసిన బీఆర్ఎస్ ను జరగబోయే ఎన్నికలలో ఆటో డ్రైవర్ల అంతా ఏకమై ఈ ప్రజా వ్యతిరేక బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తీర్మానించడం జరిగింది.

secunderabad-is-a-heap-of-problems
secunderabad-is-a-heap-of-problems

నియోజకవర్గంలో కేవలం ఎన్నికల ఆరు నెలల ముందు శంకుస్థాపనలతో హడావుడి తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదని అన్నారు.
కావున బీఆర్ఎస్ ఓటమితో నే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనీ నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించి ఓటుతో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
అటోయూనియన్ గౌరవ అధ్యక్షులు
ఎండి.ఉమర్ఖాన్, వైస్ ప్రెసిడెంట్ లతీఫ్, జోగురాములు, హనుమంతు, ఆంజనేయగౌడ్, లడ్డు, అంజి, యాదగిరి, శివ, యాకయ్య, ప్రవీన్, వెంకటేష్, రవి, జోసెఫ్, అలీ, అంజాత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular