సికింద్రాబాద్ పార్లమెంట్ మాదే
భట్టి
సికింద్రాబాద్
సికింద్రాబాద్ పార్లమెట్ అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఆదమ్ సంతోష్ అధ్వర్యంలో జరిగిన నియోజక వర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశానికి బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, నగరానికి మంచినీటిని తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే నని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మేల్యే ప్రకాష్ గౌడ్,బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ముఖ్యమంత్రిని కలవడంపై స్పందిస్తూ ఇతర అంశలేమి లేవని తెలిపారు., గతంలో ముఖ్యమంత్రిని వారి పార్టీ ఎమ్మేల్యేలు తప్ప ఇతరులు కలిసే అవకాశం ఉండేది కాదని అన్నారు. ఆ ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్ లో ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందని వెల్లడించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ మాదే
- Advertisement -
- Advertisement -