మేడ్చల్: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్ హాఫీస్ పేట ప్రేమ్ నగర్ లో గాంధీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. న్యూ హఫీస్ పేట కోర్టు వివాదలో ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని దృక్పథంతో రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేయటం జరిగిందని ఆయన చెప్పారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. ప్రజలందరూ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మహిళలకు పెన్షన్. పేద మధ్యతరగతి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోని తయారు చేసిందని చెప్పారు. మేనిఫెస్టో ప్రకటించిన హామీలుగా కాకుండా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అనేక హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయముతో ఉందని గాంధీ వివరించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే గాంధీకి మహిళలు హారతులతో స్వాగతం పలికారు.




