ఎల్బీనగర్ లో శరవేగంగా అభివృద్ధి
అభివృద్ధిని చూసి తనను ఎమ్మెల్యేగా గెలిపించండి
కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ డిఫెన్స్ కాలనీ పార్కు ఆవరణలో సోమవారం కాలనీవాసులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అండర్ పాసుల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో అత్యధిక పార్కులను నిర్మించిన ఘనత తమకే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాలంటే కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని, తనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించాలని ఆయన ఓటర్లను కోరారు. అభివృద్ధి కొనసాలంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కాలనీవాసులు అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, గజ్జల మధుసూదన్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డి, కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ నల్ల రఘుమరెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, రాజిరెడ్డి, డిఫెన్స్ కాలనీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, వివిధ కాలనీల వాసులు, చిలువేరు అశోక్, డాక్టర్ విఠల్, వినోద్, ప్రేమ్ జీ, అధిక సంఖ్యలో కాలనీవాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.