మేడ్చల్: ఎన్నికలప్పుడే వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు చీకోడుతున్నారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి ప్రజలను ప్రజా ప్రతినిధులను రెచ్చగోడుతున్నాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో ఎన్నికల్లో భాబాగంగా అయన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తో పాటు కల్యాణలక్ష్మి, శాదీముభారక్, ఆసరా పెన్షన్లు ఇస్తూ దేశంలోనే ఆదర్శంగా పాలిస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యలన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంలు చేసే పార్టీ అని ఎవరూ కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.



