Sunday, September 8, 2024

ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే సీమ అభవృద్ధి

- Advertisement -
seemas-development-is-due-to-the-telugu-ganga-project-brought-by-ntr
seemas-development-is-due-to-the-telugu-ganga-project-brought-by-ntr

సీమ సాగునీటి ప్రాజెక్టు ద్రోహం

విజయవాడ, జూలై, (వాయిస్ టుడే): రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు పూర్తిగా తగ్గించేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.  రాయలసీమ మొత్తం 12 ప్రాజెక్టులకు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టింది 12 వేల కోట్లు జగన్ తన హయం లో ఖర్చు పెట్టింది 2000 కోట్లు మాత్రమే  ఖర్చు పెట్టారని ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో జరిగిన సమావేశంలో సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు, రాయలసీమకు నళ్లిచ్చిలా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.  2014-19 మధ్య ఇరిగేషన్ కు  టిడిపి ప్రభుత్వం ఖర్చు  పెట్టింది రూ.68,293 కోట్లు ఖర్చు  అయితే సీఎం జగన్  ప్రభుత్వం  ఖర్చు పెట్టింది రూ. 22165 కోట్లు మాత్రమేనన్నారు.  తెలుగుదేశం హయాంలో ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్లో 9.67% పైగా ఖర్చు పెడితే  ..ఇప్పుడు  ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్లో 2శాతం మాత్రమే  కేటాయించారని  ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.  నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. రాయలసీమ ప్రజలకు హోప్ కలిగించిన పార్టీ టీడీపీ అని అన్నారు. అనంత లాంటి జిల్లాల్లో పదేళ్లల్లో ఎనిమిదేళ్లు వేరుశెనగ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవన్నారు. కరవులో ఉన్న సీమ ప్రజలకు తెలుగు గంగను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. హంద్రీ – నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని తెలిపారు. ఆ తర్వాత పట్టిసీమ ద్వారా సీమకు నీటిని తరలించామని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపట్టాలని అప్పటి ప్రధాని వాజ్ పేయిని కోరానని.. గంగా – కావేరీ కలపాలని సూచించామన్నారు. ఏపీ విభజన తర్వాత పోలవరం ద్వారా కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం కోసం ప్రయత్నించామని తెలిపారు. దీనికి అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను రూపొందించి వాటిల్లో కొన్నింటికి టెండర్లు కూడా టీడీపీ హయాంలో పిలిచామన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీలో ప్రతీ ఎకరాకు నీరందించే ప్రయత్నం చేశామన్నారు. టీడీపీ హయాంలో మొత్తం బడ్జెట్టులో 9.63 శాతం ఇరిగేషన్ కోసం కేటాయింపులున్నాయని.. కానీ జగన్ హయాంలో మొత్తం బడ్జెట్టులో 2.35 శాతం మాత్రమే ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.   వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు పూర్తిగా తగ్గించడంపై చందర్బాబు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి గ్రాఫ్‌ల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వస్తున్న సమయంలో అసలు పూర్తిగా నిధులు  తగ్గించేశారని చంద్రబాబు బయట  పెట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్