ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క.వెంకటాపురం మండలం రామంజపూర్ గ్రామంలో 50 వేల మందితో నిర్వహించే మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్న రాహుల్ గాంధీ.భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.

ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే సీతక్కపరిశీలించారు.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామప్ప చేరుకొని,యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.అనంతరం వెంకటాపురం మండలం రామంజపూర్ గ్రామంలో 50 వేల మందితో నిర్వహించే మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొంటారని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క హేలిప్యాడ్ మరియు బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు.


