Sunday, September 8, 2024

ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు.. డబ్బు పంపండి

- Advertisement -

నకిలీ ఉద్యోగాల పేరుతో వల

హైదరాబాద్, ఆగస్టు 21:  నకిలీ ఉద్యోగాల పేరిట యువతకు వల వేసి లక్షల డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలది రామ్ గోపాల్ రాజమండ్రిలో ఉంటూ అమాయక యువత నుంచి ఉద్యోగాల పేరిట సోషల్ మీడియా వేదికగా ఎన్నో సైబర్ మోసాలకు పాల్పడ్డాడు. బీటెక్‌ సివిల్ ఇంజనీర్ పూర్తి చేసి, ప్రస్తుతం లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తు, గత కొంత కాలంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. అధిక డబ్బులు సంపాధించాలనే దురాశతో రామ్ గోపాల్ పేపర్ ప్రకటనల ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీస్ట్స్ కావాలని careersnhm.gov@gmail.com అనే ఫేక్ మెయిల్ ఐడీని తయారు చేసి నిరుద్యోగ యువతకు వల వేస్తున్నాడు. పేపర్ ప్రకటన చూసిన కొంత మంది నిరుద్యోగ యువత వారి పూర్తి బయోడేటాని సదరు ఈమెయిల్‌కు పంపించేవారు. వారి బయోడేటాని పరిశీలించి వారి మెయిల్‌కి గాని లేదా వాట్సప్ ద్వారా గాని అప్లికేషన్ పంపి, త్వరలో మీకు ఇంటర్వ్యూ ఉంటుందని రామ్ గోపాల్ సొంతంగా తయారు చేసిన నకిలీ అపాయింట్‌మెంట్ జాబ్ లెటర్లను తన ఫెక్ మెయిల్ ద్వారా పంపేవాడు.వాటిని చూసిన నిరుద్యోగులు అపాయింట్‌మెంట్‌ లెటర్లోని మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేయగా జాబ్ కావాలంటే మొదటగా 50 వేల రూపాయలు పంపవలసి ఉంటుంది చెప్పేవాడు. ఉద్యోగం ఆశ చూపి ఇలా నిరుద్యోగుల నుంచి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లక్షల డబ్బు కొల్లగొట్టాడు. అంతేకాకుండా తన వద్దకు ఇంటర్వ్యూకి వచ్చిన వారి నుంచి బ్యాంక్ పాస్ బుక్‌లు, వ్యక్తిగత వివరాలను సేకరించేవాడు. తన ఫోన్ పే మొబైల్ నెంబర్ ఇతరులకు పంపితే దొరికిపోతనేమోననే భయంతో సిమ్ కార్డుల అడ్రస్‌లు దొరకాకుండా ఇతరుల పేరిట సిమ్ కార్డులు కొనుగోలు చేసేవాడు. కోరుమెల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తి వద్ద ఒక్కొక్క సిమ్‌కు అధిక ధర చెల్లించి సిమ్‌లు కొనుగోలు చేసేవాడు. నిందితులు వాటిని ఉపయోగించి ఇతరులకు పంపిన డబ్బులు ఆన్‌లైన్‌లో తన ఖాతాకు పంపించుకునే వాడు. అనంతరం ఆ ప్రూఫ్ లెస్ సిమ్ కార్డ్స్ ని విరిచి పడేసేవాడు. ఈ క్రమంలోనే OLX app లో రాంగోపాల్ పంపించిన ప్రకటన చూసిన ఆవుల లక్ష్మి ప్రియ అనే యువతి నిందితుడి వద్దకు ఇంటర్వ్యూకి రాగా ఆమె వద్ద నుంచి ATM కార్డ్ తీసుకున్నాడు.వేములవాడ పట్టణంలోని తిప్పాపురానికి చెందిన అజ్మీర గణేష్ అనే వ్యక్తి భార్య సునీతకి జీమెయిల్‌ వచ్చింది. ఆయుష్మాన్ భారత్‌లో PRO పోస్ట్ ఉందని మెయిల్ చేసి వివరాల కోసం 9515559446 నెంబర్ ని సంప్రదించాలని సదరు జీమెయిల్‌ తెలిపాడు. అది నమ్మిన సునీత ఆ నెంబర్‌కి కాల్ చేసి నిందితుడితో మాట్లాడగా ఉద్యోగం కావాలంటే రూ.2,85,000 ఫోన్ పే చేయాలని కోరారు. వెంటనే సునీత ఆ మొత్తం నగదు ఫోన్‌ పే చేసింది. తర్వాత నిందుతుడు పత్తాలేకుండా పోవడంతో మోసపోయానని గ్రహించిన సునీత ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడి పూర్తి వివరాలు బయటపడ్డాయి. జిలా సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్, వేములవాడ టౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఏపీకి చెందిన ఇద్దరు నిందుతులు పట్టుబడ్డారు. రాజమండ్రికి చెందిన సలది రాంగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంగవరం మండలానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు.పోలీస్‌ స్పెషల్ టీమ్ అతన్ని ట్రేస్‌ చేసి వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతలో పోలీసులకు చిక్కాడు. నిందితుల నుంచి రూ. 1,60,000 నగదు, ఒక మారుతి సుజికి, సియాజ్ కార్, 163 సిమ్ కార్డ్స్, 3 మొబైల్ ఫోన్ ,6 బ్యాంక్ పాస్ బుక్స్, 4 ఏటీఎం కార్డ్స్,7 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరలించారు. నిందితుల్లో సాలది రాంగోపాల్‌పై దేశవ్యాప్తంగా 1351, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 257 పిర్యాదులు వచ్చాయి. అతనిపై దేశవ్యాప్తంగా 65 కేసులు నమోదయ్యాయి. గతంలో 12 కేసుల్లో జైల్ శిక్ష సైతం అనుభవించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇప్పటి వరకూ కోటి 20 లక్షల వరకు చీటింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రాజన్న సిరిసిల్ల సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్, రాజాతిరుమలేష్, వేములవాడ టౌన్ ఎస్ఐ రమేష్, రజినీకాంత్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డ్స్ అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్